ఈదర నుంచి 141వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

21 Apr, 2018 09:11 IST
 కృష్ణా : వైయ‌స్ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. 141వ రోజు ఈదర శివారు నుంచి శనివారం ఉదయం వైయ‌స్ జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం సీతారాంపురం, బత్తులవారిగూడెం క్రాస్‌ మీదుగా యనమదలకు పాదయాత్ర చేరుకుంటుంది. అనంతరం నూజివీడులోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్‌కు చేరుకుని వైయ‌స్‌ జగన్‌ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.