ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర

4 Apr, 2018 10:37 IST
గుంటూరు:

కింగ్ హోటల్ సెంటర్ శివారు నుంచి  జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. ఆయనతోపాటు నడుస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు  సంఘీభావం ప్రకటిస్తున్నారు. అనేక మంది తమ సమస్యలను చెప్పుకుంటూ, పరిష్కరించమని విజ్ఞాపన పత్రాలు అందచేస్తున్నారు. వారికి భరోసా ఇస్తూ ప్రజా సంకల్పయాత్రను కొనసాగిస్తున్నారు ప్రతిపక్ష నేత.