వైయస్ జగన్‌ను కలిసిన 108 సిబ్బంది
11 Nov, 2017 10:57 IST
వైయస్‌ఆర్ జిల్లా: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని 108 ఉద్యోగులు శనివారం కలిశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఐదో రోజు జమ్ములమడుగు నియోజకవర్గంలోని మార్గమధ్యలో 108 ఉద్యోగులు కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. మన ప్రభుత్వం రాగానే 108, 104 సేవలను విస్తృతం చేస్తానని, ఉద్యోగులను ఆదుకుంటానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.