జననేతకు జేజేలు
శ్రీకాకుళం: సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి విజయవంతంగా పూర్తి చేసిన రాజన్న తనయుడికి జనం జేజేలు పలుకుతున్నారు. చివరి రోజు ప్రజా సంకల్ప యాత్రకు జనం పోటెత్తారు. పాదయాత్రతో వైయస్ జగన్ చరిత్ర సృష్టించారని హైదరాబాద్‌కు చెందిన రాజ్యలక్ష్మి అనే మహిళ పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, కత్తితో దాడి చేసినా ప్రజాసంకల్పయాత్రను విజయవంతం చేయడం మామూలు విషయం కాదన్నారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర తర్వాత జనసమ్మోహనరెడ్డిగా మారిపోయారని విస్సన్నపేటకు చెందిన జయకర్ ప్రసంశించారు. ప్రజాసంకల్పయాత్ర విజయసంకల్పయాత్రగా మారడంలో ఎటువంటి సందేహం లేదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఏపీ ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని కడపకు చెందిన డాక్టర్ రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలంలోని కొజ్జీరియా నుంచి చివరిరోజు పాదయాత్రను వైయస్ జగన్ ప్రారంభించారు. జననేత వెంట నడిచేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిందరినీ చిరునవ్వుతో పలకరించి ముందుకు సాగుతున్నారు. జననేత పాదయాత్ర సాగుతున్న దారిలో యువత కోలాహలం కనిపిస్తోంది.