ప్రజలకు అండగా వైయస్సార్సీపీ
29 Jul, 2016 10:36 IST
గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయ కర్త పెట్ల ఉమా శంకర్ గణేష్ గడపగడపలో పర్యటించారు. బాబు చేసిన మోసాలను ప్రజలకు తెలియజెప్పారు. మీ అందరికీ జగనన్న అండగా ఉంటారని భరోసా ఇచ్చారు . మాకవరపాలెం మండలం, గంగవరం పంచాయతీలలోఆయన పర్యటించారు.
విశాఖ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో కశింకోట మండలము లోని తాల్లపాలెం సంత లో గడప గడపగడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ వైపల్యాలను గడపగడపకు వెళ్లి ప్రజలకు వివరించారు. గ్రామ సమస్యలను ప్రజలు నాయకుల దృష్టికి తీసుకెళ్ళారు. కార్యక్రమములో పార్టీ నాయకులు గొల్లవెల్లి శ్రీనివాస్ రావు, శ్రీధర్ రాజు, గొర్లె సూరి బాబు, సోము నాయుడు, గణేష్, పి.డి.గాంధీ, జగన్, జాజుల రమేష్, వేగి త్రినాధ్, గైపుడి రాజు, భాభి, గంటా సముద్రా, పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.