నిర్విరామంగా గడపగడపకు వైయస్ఆర్ సీపీ
అవిశ్రాంతంగా గడపగడపకు వైయస్ఆర్ సీపీ కార్యక్రమం సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేయడానికి చేపట్టిన గడపగడపకూ వైయస్ఆర్ సీపీ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. నిన్న జరిగిన ప్రత్యేక హోదా బంద్ లో పాల్గొని పార్టీ శ్రేణులు దిగ్విజయం చేశాయి. అదే ఉత్సాహంతో వైయస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. ప్రజాబ్యాలెట్ లో చంద్రబాబు ప్రభుత్వానికి సున్నా మార్కులే వస్తున్నాయన్నాయి. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో విసిగి వేసారిపోయామని, రాజన్న రాజ్యం అందించే జగనన్న పాలన రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి ప్రభుత్వం ఉండాలని, కానీ సమస్యలు సృష్టించే విధంగా ప్రభుత్వం ఉండటం దురదృష్టమని ప్రజలు వాపోతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వారిని ఓదార్చడానికి వస్తున్న వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పడుతున్నారు.