అసలు ఎవరు కడతారు బాబు..?
12 Jul, 2016 11:55 IST
రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోలేదు
ప్రభుత్వాన్ని నిలదీసిన రైతులు, డ్వాక్రామహిళలు
గడపగడపకూ వైయస్సార్సీపీకి విశేష స్పందన
వైయస్సార్ జిల్లా: ‘మా పార్టీ అధికారంలోకి రాగానే రైతులు, డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వడ్డీతో సహా మాఫీ చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రగల్బాలు పలికారు. ఇప్పుడు మాఫీ చేసిన సొమ్ము వడ్డీకి కూడా సరిపోలేదు. బ్యాంకులకు అసలెవరు కడతారు బాబు’ అని పలువురు రైతులు, డ్వాక్రా మహిళలు ప్రభుత్వాన్ని నిలదీశారు. గడప గడపకూ వైయస్సార్‌సీపీ కార్యక్రమంలో భాగంగా నందలూరు మండలం టంగుటూరు, మైలవరం మండలం నవాబుపేట, చిట్వేలి మండలం కేఎస్ అగ్రహారం గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఎస్ అగ్రహారంలో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కొల్లం బ్రహ్మానందరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్‌రెడ్డి, మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులరెడ్డి, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ మోసాలను ఎండగట్టారు.