విశాఖ ప్రతిష్టను దిగజార్చుతున్న చంద్రబాబు

29 Jun, 2017 12:24 IST

విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం పేరు ప్రతిష్టలను దిగజార్చుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కరణం ధర్మశ్రీ ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్‌ల డైరెక్షన్‌లో విశాఖపట్నం భూకబ్జాలకు గురవుతుందన్నారు. చోడవరం నియోజకవర్గం చందకవీధి, కోపరేటివ్‌ కాలనీల్లో ధర్మశ్రీ ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు మోసాలను వారికి వివరించారు. బాబు తప్పుడు హామీలపై ప్రచురించిన ప్రజాబ్యాలెట్‌ను అందజేసి టీడీపీ పాలనపై మార్కులు వేయించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.