ఇచ్చిన మాట తప్పిన బాబుకు బుద్ధి చెప్పండి
10 Dec, 2016 16:02 IST
కర్నూలు(పాణ్యం))ఏపీకి ప్రత్యేకహోదా వస్తేనే పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతోందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. 19వ వార్డులో గడపగడపకు వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు తదితర సమస్యలను ప్రజలు ఏకరువు పెట్టారు. తాము అధికారంలోకి వస్తే 15 ఇళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు...గద్దెనెక్కాక ప్రజలను మోసం చేశారని చరితారెడ్డి మండిపడ్డారు. ఓటేసి గెలిపించిన ప్రజలను నట్టేట ముంచాడని ఫైర్ అయ్యారు.