ఖాళీ అవుతున్న టీడీపీ

12 Dec, 2016 12:34 IST
కర్నూలు(బనగానపల్లె))నియోజకవర్గ ఇంచార్జ్ కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో కోవెలకుంట్ల మండలం కలుగోట్ల గ్రామంలో గడపగడపకు వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి గుండం సూర్యప్రకాష్ రెడ్డి , జిల్లా అధికార ప్రతినిధి కర్ర హర్షవర్ధన్ రెడ్డి ,నియోజకవర్గ అబ్జర్వర్ మాధవ రెడ్డిలు హాజరయ్యారు. గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి  ప్రజాబ్యాలెట్ ను ఇచ్చి, తెలుగుదేశం పార్టీ చేస్తున్న మోసాల గురించి సవివరంగ తెలియచేశారు . చంద్రబాబు పరిపాలనకు మీరే ప్రజా తీర్పు ఇవ్వండని తమ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ విధి , విధానాలు నచ్చక ఆ పార్టీకి చెందిన రామేశ్వర్ రెడ్డి అనే నాయకుడు వైయస్సార్సీపీలో చేరారు. అంతే  గాకుండా గ్రామంలోని బిసి కాలనీకి చెందిన 50 మైనారిటీ కుటుంబాలు కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ....గ్రామాల్లో గడప గడపకు వైయస్ఆర్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని తెలిపారు. చంద్రబాబు మోసాలను గ్రహించి టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైయస్సార్సీపీలో చేరుతున్నారని, రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ కి నాయకులూ ,కార్యకర్తలు కరువు అవుతారు అని రామిరెడ్డి అన్నారు.  ప్రజలకు న్యాయం చేసే నాయకుడు వైయస్ జగన్ మాత్రమేనని, ఆయన ముఖ్యమంత్రి అయితేనే ప్రజల కష్టాలు తీరుతాయి అని చెప్పారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.