అవినీతి సర్కార్ పై పెల్లుబికిన ఆగ్రహం
17 Sep, 2016 13:17 IST
అటకెక్కిన హామీలు
.jpg)
నర్సీపట్నం)) బాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయడంలేదని పిపి అగ్రహారం గ్రామస్తులు మండిపడ్డారు. మాకవరపాలెం మండలం, పిపి అగ్రహారం గ్రామంలో నిర్వహించిన గడపగడపకు వైయస్ఆర్ సీపీ కార్యక్రమంకు ప్రజనుంచి విశేష స్పందన అభించింది. వైయస్ఆర్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను వారికి వివరించారు. కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బాబు పాలనపై ప్రజల మండిపాటు
బనగానపల్లె)) అబద్ధపు హామీలతో బాబు ప్రజలను మోసం చేశారని వైయస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. వసంతాపురం, బొందలదిన్నె, సంజామల గ్రామాల్లో శ్రీరామిరెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు వైయస్ఆర్ సీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు, హామీల అమలుపై ప్రజాబ్యాలెట్ లో మార్కులు వేయించారు. బాబు పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
.jpg)
ప్రజాధనం లూటీ
నరసన్నపేట))సీఎం చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, అన్ని విధాలా ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని నరసన్నపేట మాజీ ఎమ్మల్యే, వైయస్ఆర్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తూర్పారపట్టారు. మండలంలోని తామరాపల్లిలో గడపగడపకు వైయస్ఆర్ సీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని, దారుణంగా మోసపోయామని గ్రామానికి చెందిన మహిళలు కృష్ణ దాస్ ఎదుట వాపోయారు. కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.