ప్రజలను నట్టేట ముంచారు
17 Aug, 2016 10:41 IST
కర్నూలు జిల్లా(ఎమ్మిగనూరు): ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి చంద్రబాబు ప్రజలను మోసగించారని ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రజాసమస్యలు గాలికొదిలేసి బాబు విదేశాల వెంబడి తిరుగుతున్నారని మండిపడ్డారు. గడపగడపకు వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఎమ్మిగనూరు టౌన్ లో పర్యటించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ...గడపగడపకు వైయస్ఆర్ సీపీ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆయన అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తే తప్ప రామరాజ్యం రాదని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.