బాబుకు అంతటా సున్నా మార్కులే
కర్నూలుః ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనకు ప్రజలంతా సున్నా మార్కులే వేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా శేషారెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని వెలుగోడు పట్టణం వార్డు నెంబర్ 17లో శేషారెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శేషారెడ్డి మాట్లాడుతూ... అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు తప్పుడు హామీలను కురిపించి ప్రజలను మోసం చేశాడని మండిపడ్డారు. జన్మభూమి కమిటీల పేరుతో పేద ప్రజలకు సంక్షేమాలను అందకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం మళ్లీ తిరిగొస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.