బాబును ఈసడించుకుంటున్న ప్రజలు
21 Apr, 2017 19:14 IST
ప్రకాశంః చంద్రబాబు పరిపాలనను ప్రజలంతా ఈసడించుకుంటున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు విమర్శించారు. నియోజకవర్గ పరిధిలోని పొన్నలూరు మండలం కె.అగ్రహారం గ్రామంలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ.. చంద్రబాబు అవినీతి పరిపాలనను ప్రజలకు వివరించారు. రైతులు మొదలు చిన్న పిల్లల వరకు అందరినీ టీడీపీ సర్కార్ మోసం చేసిందని మండిపడ్డారు. అనంతరం ప్రజాబ్యాలెట్‌ను స్థానికులకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.