ప్రజలంతా బాబుకు వ్యతిరేకమే
24 Mar, 2017 17:13 IST
ప్రకాశంః చంద్రబాబు పరిపాలనపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ హెచ్చరించారు. నియోజకవర్గ పరిధిలోని పామూరు టౌన్ 5వ వార్డులో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ బాబు అవినీతి పరిపాలనపై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.