జన్మభూమి కమిటీల ఏకపక్ష పాలన

30 Jan, 2017 15:03 IST

పోలాకిః గ్రామాల్లో అనర్హులను అందలమెక్కించి టీడీపీ నాయకులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైయస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన క్రిష్ణదాస్ మండిపడ్డారు. పోలాకి మండల పరిధిలోని దీర్ఘాశి పంచాయతీ పరిధిలో పార్టీ నేత అప్పారావుతో కలిసి గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. నరసన్నపేటలో గడపగడపకు కార్యక్రమం 100రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రజలు తమ సమ్యలను ఏకరువు పెట్టారు.  అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీలు ఏకపక్ష పాలన సాగిస్తున్న వైనాన్ని ధర్మాన తప్పుబట్టారు. ప్రజల చేత ఎన్నికోబడిన ప్రజాప్రతినిథులని కాదని అనర్హులకు పథకాలు కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సైతం తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.