భర్త చనిపోయి నాలుగేళ్లయినా పింఛన్ రాలేదు
5 Aug, 2016 11:53 IST
అనంతపురం(శెట్టూరు): బిడ్డా... నా భర్త చనిపోయి నాలుగేళ్లయింది. పింఛన్ ఇస్తలేరు. అధికారుల చుట్టూ తిరిగి.. తిరిగి... సాలయిపోయింది. చనిపోయినట్లు ధృవీకరణ పత్రాలు ఉన్నా అధికారులు మాత్రం పింఛన్ ఇవ్వడం లేదు. ఇదిగో వస్తాది.. అదిగో వస్తాదంటూ చెబుతున్నారే గాని పింఛన్ ఇచ్చిన పాపాన పోలేదని శెట్టూరు మండలం చిన్నంపల్లికి చెందిన మల్లక్క ఆవేదన వ్యక్తం చేసింది.
నాకు 65 ఏళ్లు బిడ్డా... నా భర్తకు 68 ఏళ్లు... ఎవ్వరికీ పింఛన్ రావడం లేదు. కారణమేమిటంటే మేము వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారమంట. ఇదెక్కడి న్యాయం అని చిన్నంపల్లికి చెందిన షావాది ఈరమ్మ కళ్యాణదుర్గం నియోజకవర్గ వైయస్సార్‌సీపీ సమన్వయకర్త ఉషశ్రీచరణ్ ఎదుట వాపోయారు. వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమం మండలంలోని చిన్నంపల్లి గ్రామ పంచాయతీలో జరిగింది. పార్టీ సమస్వమకర్త ఉషశ్రీతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు