నవరత్నాలతో ప్రజా జీవనం మెరుగు
23 Oct, 2017 14:51 IST
తూర్పుగోదావరి: వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలతో ప్రజల జీవితాలు మెరుగుపడతాయని పార్టీ తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని కాట్రేనికోన మండలం నడవపల్లిలో పితాని ఆధ్వర్యంలో వైయస్‌ఆర్ కుటుంబం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను వైయస్ఆర్ కుటుంబంలో భాగస్వాములను చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైయస్ జగన్‌ను సీఎం చేసుకుంటే దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజా పరిపాలన తిరిగొస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీని గెలిపించి మోసపూరిత చంద్రబాబు పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.