గడపగడపలో వైయస్సార్సీపీకి ఘనస్వాగతం
23 Aug, 2016 16:27 IST
వైయస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గడపగడపకూ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బాబు పాలనలో దగాపడిన ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్న వైయస్సార్సీపీ శ్రేణులను ప్రతీ గడప అక్కున చేర్చుకొని ఆదరిస్తోంది. ఆచంట మండలం చిన్నపేట గ్రామంలో గడపగడపలో వైయస్సార్సీపీ శ్రేణులు పర్యటించారు. ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా నేతలు మాట్లాడుతూ...బాబు పాలనపై ప్రజలు విసిగిపోయారని అన్నారు.
.jpg)
.jpg)
పెనుగొండ)) కోటలపర్రు గ్రామంలో వైయస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం సాగింది. పెళ్లకూరు మండలం, కానూరులో వైయస్సార్సీపీ ఎమ్మెల్యే సంజీవయ్య గడపగడపలో పర్యటించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ ఇంఛార్జ్ సీ.హెచ్. నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మద్దికెర మండలం పెరవాలిలో గడపగడపకూ కార్యక్రమం సాగింది.
.jpg)
శ్రీశైలం నియోజకవర్గం ఇంఛార్జ్ బుడ్డా శేషారెడ్డి చిన్నదేవలపురం గ్రామంలో ప్రజల వద్దకు వెళ్లారు. విశాఖ జిల్లా అచ్యుతపురం మండలం నడీంపల్లి గ్రామంలో యలమంచిలి నియోజకవర్గ కన్వీనర్ ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో బాబు ఇచ్చిన వాగ్దానాల అమలుకు సంబంధించి మార్కులు వేయాలని ప్రజలకు కరపత్రాలు అందించారు. బాబుకు వందలో ఒక్క మార్కు కూడా పడలేదు.
.jpg)