గిద్దలూరులో గడప గడపకూ వైయస్ఆర్
18 Apr, 2017 12:50 IST
ప్రకాశంః గిద్దలూరు మండలం తాల్లపల్లి గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఐ.వీ.రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి గడపకు వెళ్లి చంద్రబాబు ఎన్నికలు హామీలు అమలు అయ్యాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. బాబు మోసాలను నమ్మి మోసపోయిన ప్రజలు రానున్న ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.