భీమనపల్లిలో గడప గడపకూ వైయ‌స్ఆర్‌

15 Feb, 2017 18:31 IST

తూర్పు గోదావ‌రి:  భీమనపల్లి గ్రామంలో గురువారం, శుక్రవారం గడప గడపకూ వైయస్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్లు పార్టీ మండల అధ్యక్షుడు బద్రి బాబ్జీ బుధవారం తెలిపారు. గురువారం ఉదయం, శుక్రవారం మధ్యాహ్నం నుంచి కార్యక్రమం ఉంటుందన్నారు. పార్టీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ కోఆర్డినేటర్‌ పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయిలు ముఖ్యఅతిధిలుగా హజరవుతారన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హజరుకావాలని బాబ్జీ కోరారు.