అసమర్థత పాలనకు స్వస్తి చెబుదాం
7 Apr, 2017 16:47 IST
ముమ్మిడివరం: చంద్రబాబు అసమర్థత పాలనకు రానున్న ఎన్నికల్లో స్వస్తి చెప్పి.. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ముమ్మిడివరం నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ అన్నారు. కాట్రేనికోన మండలంలో కాట్రేనికోన పంచాయతీ పరిధిలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ చంద్రబాబు నీచ పరిపాలనను ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో అబద్ధపు హామీలిచ్చి చంద్రబాబు ప్రజలను మోసగించారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తమ ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు.