జగనన్నతోనే అభివృద్ధి సాధ్యం
11 Oct, 2017 18:11 IST
సుండుపల్లి: రాష్ట్రాభివృద్ది జననేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని ఎంపీపీ అజంతమ్మ, జడ్‌పీటీసీ హాకింసాబ్‌లు తెలిపారు. సుండుపల్లి మండలంలోని పోచంవాండ్లపల్లి, రెడ్లచెరువు, ఎగువ మాలపల్లె, కొత్తవడ్డిపల్లె పలుప్రాంతాల్లో ఇంటింటా తిరిగి జగనన్న అధికారంలోకి రాగానే అమలుచేసే నవతర్నాలు, కరపత్రాలు అందజేశారు. ప్రజలు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పాలన కోరుకుంటున్నారని అది జగన్‌తోనే సాధ్యమని వారన్నారు. అమలుకాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో బుద్దిచెపుదామని పిలుపునిచ్చారు. ఆమె వెంట ఎస్టీనాయకులు చంద్రనాయక్, బూత్‌కన్వీనర్ నాగేశ్వర్, పట్టణకేంద్రంలో ఉపసర్పంచ్ సిరాజుద్దీన్, సంజీవరెడ్డి, గుండ్లపల్లిలో చింటు, రాయవరంలో శివారెడ్డి, కంరీంభాష, రషీద్ తదితరులు వైయస్సార్ కుటుంబం కార్యక్రమం జరిగింది.
................................................
నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగు
శిరివెళ్ల: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగు నిండితుందని జెడ్పిటీసీ సభ్యుడు నజీర్ అన్నారు. బుధవారం స్థానిక పంచాయతీ 87వ పోలింగ్ బూతు పరిధిలోని 1వ వార్డులో నవరత్నాల ప్రచారం, వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బూతు కన్వీనర్ పెసరవాయి రఫీ, కమిటీ సభ్యులు చంద్రబాబు హామీల అమలు విఫలం, నవరత్నాలను గురించి ప్రజలకు వివరించారు. అనంతరం జెడ్పిటీసీ మాట్లాడుతు దివంగత నేత వైఎస్సార్ అడుగు జాడల్లో జగన్ నడుస్తున్నారన్నారు. రైతాంగంకు రూ. 50 వేల పెట్టుబడి, పేదలకు రూ. 2వేల పింఛన్ ఇస్తారన్నారు. బాబు హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. రైతు, డ్వాక్రా సంఘాల పూర్తి రుణమాఫీ జరగలేదన్నారు. ఎన్నికల ముందు రుణాలన్ని బేషరతుగా మాఫీ చేస్తానని బాబు అన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు సర్థార్, అన్వర్‌భాష, బూతు కన్వీనర్ పీ. రఫీ, షాహినూర్, బీసీ సంఘం జిల్లా నాయకుడు మంగళి రమణ, ఎంజీ సుబహాన్, కాశింసా తదితరులు పాల్గొన్నారు.