పాలకుల వివక్షతో అభివృద్ధికి దూరంగా కాలనీలు

29 Dec, 2016 15:53 IST

గుంటూరు))గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణ పట్టణంలోని 7వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని వెంకటరమణ అన్నారు. కాలనీలో ఒక్క గృహనిర్మాణం జరిగిన పాపాన పోలేదన్నారు. రైతులు, డ్వాక్రారుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఖాళీ స్థలాలను ఆక్యూపై చేస్తూ దుర్మార్గ రీతిలో ప్రభుత్వం నడుస్తోందని ధ్వజమెత్తారు. డీవీసీ కాలనీపై పాలకులు వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు.