గిరిజన అభివృద్ధి గాలికొదిలేసిన బాబు
29 Sep, 2017 11:47 IST
పశ్చిమ గోదావరిః చంద్రబాబు నాయుడు గిరిజన అభివృద్ధిని గాలికొదిలేశాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మండిపడ్డారు. కనీస వసతులు లేక గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొయ్యలగూడెం మండలం గన్నవరంలో తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో వైయస్ఆర్ కుటుంబం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరుగుతూ.. చంద్రబాబు రాక్షస పాలనపై వివరిస్తూ వైయస్ఆర్ కుటుంబంలో ప్రజలను భాగస్వాములను చేశారు. రానున్న ఎన్నికల్లో వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకొని గిరిజన అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.