రాబోయే ఎన్నికల్లో బాబుకు ఓటమి తథ్యం
31 May, 2017 12:36 IST
శ్రీకాకుళంః వైయస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మాన క్రిష్ణదాస్ నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం గంటపేట, నర్సాపురం, కొత్తపేట తదితర గ్రామాల్లో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ధర్మానకు గడపగడపలో విశేష ఆదరణ లభించింది. ఆయన ఇంటింటికీ తిరుగుతూ చంద్రబాబు మోసపూరిత హామీలపై ముద్రించిన కరపత్రాన్ని అందించి మార్కులు వేయించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధపు హామీలతో మోసం చేసిన చంద్రబాబుకు సున్నా మార్కులు వేశారు. రానున్న ఎన్నికల్లో బాబుకు ఓటమి తప్పదని హెచ్చరించారు.