హామీల అమలులో బాబు విఫలం
25 Apr, 2017 12:44 IST
ప్రకాశంః ఎన్నికల్లో వందల కొద్దీ హామీలిచ్చి వాటిని అమలు చేయడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని వేటపాలెం మండలం సర్వోదయకాలనీలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని ఇంటింటికీ తిరిగి చంద్రబాబు మోసపు హామీలపై ప్రచురించిన ప్రజాబ్యాలెట్‌ను ప్రజలకు అందించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కోలుకుల వెంకటేష్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.