నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి మోసం చేసిన బాబు
తూర్పుగోదావరిః అధికారం కోసం నోటికొచ్చిన అబద్ధాలన్ని ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మోసగించిన చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ధ్వజమెత్తారు. ఐ.పోలవరం మండలం, టి.కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్రజాబ్యాలెట్‌ను అందజేశారు. చంద్రబాబు అవినీతి పరిపాలనపై స్థానికులకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో రాజన్న పాలన త్వరలో వస్తుందని స్థానిక ప్రజలకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.