తప్పుడు హామీలతో మోసం
1 May, 2017 15:08 IST
ఇచ్చాపురంః తప్పుడు హామీలతో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మోసం చేశాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిరియా సాయిరాజ్ అన్నారు. ఇచ్చాపురం పరిధిలోని ఆర్ కరపాడు, శహలాలపుట్ట గ్రామాల్లో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిరాజ్ ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.