బాబు హామీలు మోసపూరితం
గొల్లప్రోలు: చంద్రబాబు బూటకపు హామీలు నమ్మి మోసపోయామని ప్రజలంతా ముక్తకంఠంతో చెబుతున్నారని వైయస్‌ఆర్ సీపీ నేత పెండెం దొరబాబు ధ్వజమెత్తారు. మూడేళ్లుగా ఇళ్లు లేవు..ఫించన్లు లేవు. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని గొల్లప్రోలుని పాపాయ్యచావిడి ప్రాంతానికి చెందిన ప్రజలు దొరబాబుకు తమ గోడు వినిపించారు. వైయస్‌ఆర్ సీపీ కన్వీనర్ పెండెం దొరబాబు గడపగడపకూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. బాబు మోసాలపై రూపొందించిన కరపత్రాలను ఇంటింటా పంచుతూ బాబు అబద్ధపు హామీలను ఆయన ప్రజలకు వివరించారు. టీడీపీ నాయకులు జన్మభూమి కమిటీల పేరుతో పేదలకు అందించాల్సిన పించన్‌లను పక్కదారి పట్టిస్తున్న వైనాన్ని వివరించారు. ప్రజాసమస్యలపై పోరాడేందుకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందన్నారు. ప్రజా పరిపాలన కావాలంటే వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.