అంతటా బాబుకు సున్నా మార్కులే
26 May, 2017 12:04 IST
విజయనగరం: పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం బుడ్డిపేట గ్రామంలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త జమ్మన ప్రసన్నకుమార్ కార్యక్రమంలో పాల్గొని గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ చంద్రబాబు అవినీతి పరిపాలనపై ప్రజలకు వివరించారు. అనంతరం ప్రజాబ్యాలెట్‌ను అందజేస్తూ బాబు పరిపాలనపై మార్కులు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు మూడేళ్ల పరిపాలనకు ప్రజలంతా సున్నా మార్కులే వేస్తున్నారని స్పష్టం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి ఓటమి తప్పదన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.