బాబు పాలనలో అన్నీ సమస్యలే
10 May, 2017 12:18 IST
పి.గన్నవరంః చంద్రబాబు పరిపాలనలో రాష్ట్ర ప్రజలంతా సమస్యల వలయంలో చిక్కుకుపోయారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలోని వాడ్రేవుపల్లి గ్రామంలో చిట్టిబాబు ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదుటి మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవిలు పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.