పీవీ సింధూ, గోపీలకు నా అభినందనలు
20 Aug, 2016 10:42 IST
ప్రకాశం:
ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో తెలుగుతేజం పీవీ సింధు రజత పతకాన్ని సాధించడంపై వైయస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయిలో భారత జెండాను రెపరెపలాడించిన పీపీ సింధూకు నా అభినందనలు' అంటూ ఆయన ప్రశంసించారు. శనివారం ఆయన ప్రకాశం జిల్లాలో విలేకరులతో మాట్లాడారు.
అద్భుతమైన ప్రతిభ కనపర్చేలా సింధూను తీర్చిదిద్దిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్‌కు శుభాభివందనాలు' అని కొనియాడారు. దేశంలో ప్రతి యువతీయువకులకు సింధూనే స్ఫూర్తి అని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.