యువభేరి పోస్టర్ రిలీజ్
17 Dec, 2016 16:28 IST
విజయనగరం: ఈనెల 19న విజయనగరంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువభేరి కార్యక్రమం జరగనుంది. పూల్‌బాగ్ రోడ్డులోని జగన్నాథ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న ఈ యువభేరికి సంబంధించిన పోస్టర్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ ఆవిష్కరించారు. యువభేరి ఏర్పాట్లను శనివారం పార్టీ నేతలు రాజన్నదొర, పెన్మత్స సాంబశివరాజు, అప్పల నరసయ్య, అప్పల నాయుడు తదితరులు పరిశీలించారు.