వైయస్‌ఆర్‌ కుటుంబం అంటే ప్రజలందరిదీ

12 Sep, 2017 18:35 IST

వెల్దుర్తి రూరల్‌ : వైయస్‌ఆర్‌ కుటుంబం అంటే రాష్ట్రప్రజలందరి కుటుంబం అని, రానున్న వైయస్‌ఆర్‌ ప్రభుత్వంలో ఇది నిరూపితమౌతుందని వైయస్‌ఆర్‌సీపీ మండల కమిటీ కార్యవర్గసభ్యుడు, గోవర్ధనగిరి నాయకుడు గోపాల్‌ అన్నారు. మంగళవారం పుల్లగుమ్మి, సూదేపల్లె, కలుగొట్ల, బుక్కాపురం, సిద్ధినగట్టు గ్రామాలలో వైయస్‌ఆర్‌ కుటుంబంలోకి ప్రజలను ఆహ్వానించి, నవరత్నాలపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. పలువురు ప్రజలు వైఎస్‌ఆర్‌ కుటుంబంలో చేరారు. గోవర్ధనగిరి గ్రామంలో తెలుగుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో గోపాల్‌ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం బీదా,సాదాలను వదిలి కేవలం వారి కార్యకర్తలకే ప్రభుత్వంలా వ్యవహరిస్తోందన్నారు. ఈ కార్యక్రమాలలో వైఎస్‌ఆర్‌ గ్రామ నాయకులు, కార్యకర్తలు, బూత్‌ కమిటీ సభ్యులు డీ కేశవ, ఎస్‌ కేశవయ్య, మహేశ్, గోరంట్ల, మద్దిలేటి, మధు, మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.