వైయస్ఆర్ సీపీలోకి సంకినేని
11 Nov, 2012 17:45 IST
సూర్యాపేట
11 నవంబర్ 2012 : టిడిపి సీనియర్ నాయకులు సంకినేని వెంకటేశ్వర రావు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం సాయంత్రం సూర్యాపేట సభలో వైయస్. విజయమ్మ పార్టీ కండువా కప్పి ఆయనను సాదరంగా వైయస్ఆర్ సీపీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు అనుచరులు, నల్లగొండజిల్లా నేత లు వైయస్ఆర్ సీపీలో చేరారు. బహిరంగ సభలో పాల్గొనడం కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షు రాలు విజయమ్మ ఆదివారం సాయంత్రం 5 గంటలకు సూర్యా పేటకు చేరుకున్నారు. ఆమెకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.సభకు భారీగా జనం హాజరయ్యారు.30 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహిస్తున్న ఈ సభలో తెలంగాణ కళాకారులు తమ ఆటపాటలతో అందరినీ ఆకట్టుకున్నారు.