ప్రజలకు మంచి చేయాలనే బలమైన సంకల్పం
7 Jul, 2018 15:00 IST
అదే వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నడిపిస్తోంది
వైయస్‌ఆర్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా
తూర్పుగోదావరి: ప్రజలకు మంచి చేయాలనే బలమైన సంకల్పంతో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపట్టారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనను ఎండగడుతూ.. దాదాపు ఏడు నెలల నుంచి పాదయాత్ర చేస్తున్న జననేతకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. మూడు వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేపట్టడం సాహసోపేత నిర్ణయమన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి లాంటి గొప్ప పరిపాలనను ప్రజలు మరోసారి వైయస్ జగన్ నాయకత్వంలో మాత్రమే చూడగలరన్నారు. ఆ నమ్మకం ప్రజల్లో ఉండబట్టే ఆయన అడుగులో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. వైయస్ జగన్ రాష్ట్రానికి కాబోయే సీఎం అని ధీమా వ్యక్తం చేశారు.