పార్టీ రాష్ట్ర యూత్ కార్యదర్శి వివాహ వేడుకలు

12 May, 2017 18:02 IST

అచ్చంపేటః వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర యూత్‌ కార్యదర్శి కన్నా హనుమంతరావు వివాహ వేడుకలు మండలంలోని చిగురుపాడు పునరావాస కేంద్రలో శుక్రవారం ఘనంగా జరిగాయి. వేడుకలకు వైయస్సార్‌ పార్టీ జిల్లా కన్వీనర్‌ మర్రి రాజశేఖర్, గుంటూరు నగర కన్వినర్‌ లేళ్ల అప్పిరెడ్డి, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి శివనాగమనోహరంనాయుడు, జిల్లా పార్టీ మైనారిటి విభాగం కన్వినర్‌ మాబు, మండల పార్టీ కన్వినర్‌ సందెపోగు సత్యం, జిల్లా పార్టీ కార్యదర్శి మంగిశెట్టి కోటేశ్వరరావు, జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శి నర్సిరెడ్డి, బెల్లంకొండ ఎంపీపీ మర్రి పద్మా వెంకటేశ్వరరెడ్డి, బీజేపీ పార్టీకి చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణలు హాజరై నూతన వధూవరులు హనుమంతరావు, లావణ్య దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాటకచేరిలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిపె ఆలపించిన గీతాలు అలరించాయి.