గుండె పోటుతో వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త మృతి
24 Jul, 2018 13:43 IST
పశ్చిమ గోదావరి: జంగారెడ్డి గూడెం పోలీసుస్టేషన్‌లో వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త కాకి దుర్గారావు గుండెపోటుతో మృతి చెందారు.ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఏపీ బంద్‌లో పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం కృష్ణాపురం వాసి దుర్గారావు పాల్గొన్నారు. ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ తరలించగా అక్కడ గుండెపోటుకు గురయ్యాడు. ఆయన్ను ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు.