సమైక్య తీర్మానానికే వైఎస్ఆర్‌సీపీ పట్టు
               17 Dec, 2013 16:18 IST            
                     
			హైదరాబాద్, 17 డిసెంబర్ 2013: 
	
      
      
                  
      
      
            
      
		      
                  
	రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్, చర్చ, బిల్లుపై అభిప్రాయం వెల్లడించడం కన్నా ముందు సమైక్య తీర్మానానికే వైయస్ఆర్ కాంగ్రెస్ పట్టుబడుతుందని పార్టీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. సభలో సమైక్య తీర్మానం చేసి చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. సభలో అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. తాము చెప్పినదాన్ని ఒప్పుకోకుండా బీఏసీ చెప్పినదాన్నే ఒప్పుకోమంటే దాన్ని వైయస్ఆర్ సీపీ ఖండిస్తుందన్నారు. మరోవైపు శాసనమండలి బీఏసీ సమావేశంలో తెలంగాణ బిల్లుపై చర్చించే అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు.