చేనేతలకు అండగా వైయస్సార్సీపీ

19 Sep, 2017 15:52 IST
  • నేతన్నల సమస్యలపై కేంద్రానికి వైయస్ జగన్ లేఖ
  • జీఎస్టీ నుంచి చేనేతలకు మినహాయింపు
హైదరాబాద్ః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కృషి ఫలితంగా జీఎస్టీ నుంచి చేనేతలకు మినహాయింపు లభించింది. ఈ సందర్భంగా నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఇటీవల వైయస్ఆర్ జిల్లా పర్యటనలో ఉన్న వైయస్ జగన్ ను చేనేతలు కలుసుకొని తమ సమస్యలు చెప్పుకున్నారు. సానుకూలంగా స్పందించిన  వైయస్ జగన్  చేనేతలకు జీఎస్టీ నుంచి మినహాయింపునిచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కేంద్రానికి లేఖ కూడ రాశారు. స్పందించిన కేంద్రం వస్తు సేవల పన్ను నుంచి నేతన్నలకు మినహాయింపునిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఇటీవల వైయస్ఆర్ జిల్లా పర్యటనలో జననేత మాట్లాడుతూ.... అసలే అవస్థల్లో ఉన్న చేనేత రంగానికి కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ అమలు వల్ల మరింత పెద్ద దెబ్బ తగులుతుందని అన్నారు. చేనేత కార్మికులకు సంబంధించి నూలు మీద 5శాతం, బట్ట తయ్యారక కూడ జీఎస్టీ 10శాతం ఇంపోజ్ చేయడం బాధాకరమన్నారు. అసలే చేనేత బట్టలకు సరైన రేటు రాని పరిస్థితిల్లో వారిపై అదనపు భారం వేయడం తగదన్నారు. చేనేత కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని జీఎస్టీ భారం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు.  వైయస్సార్సీపీ ఎంపీలు కూడ పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్లీనరీలో కూడ ప్రస్తావించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి కూడ చేనేతల గురించి అడగకపోవడం, జీఎస్టీ కౌన్సిల్ లో యనమల రామక్రిష్ణుడు మెంబర్ గా ఉండి కూడ చేనేతల గురించి ప్రస్తావించకపోవడం దారుణం.