గర్భిణిని ఆదుకున్న వైయస్ఆర్ సీపీ యూత్
10 May, 2017 15:29 IST
గిద్దలూరు: రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణి మహిళలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు రక్తదానం చేసి ఆదుకున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో షేక్ హబీబ అనే గర్భిణి రక్తహీనతతో బాధపడుతుంది. దీంతో విషయం తెలుసుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు, పార్టీ కో-ఆర్డినేటర్ ఐవీరెడ్డి యువసేన సభ్యుడు షేక్ ఇమ్రాన్ ఆమెకు రక్తం ఇచ్చి ఆదుకున్నారు. కార్యక్రమంలో పార్టీ యూత్ లీడర్ పల్లె అశోక్‌రెడ్డి, జిల్లా ఐటీ ప్రధాన కార్యదర్శి చల్లా అశోక్‌రెడ్డి, యువజన విభాగం నేతలు తదితరులు పాల్గొన్నారు.