రాష్ట్రవ్యాప్తంగా రిలే దీక్షలు...!

17 Oct, 2015 20:01 IST
హైదరాబాద్: ప్రత్యేకహోదా డిమాండ్ తో వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే దీక్షలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 21వ తేదీ వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు జరుగుతాయి. అదేవిధంగా రోజువారి పోరాటాల్లో భాగంగా 18 న నిరసనర్యాలీలు. 19 న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు, 20 న మండల కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తారు. 21 వ తేదీన ఆర్టీసీ డిపోల వద్ద ధర్నాలు చేపడతారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించేవరకు పోరు ఆగదని వైఎస్సార్సీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. 

నిరసన సెగలు..!

వైఎస్సార్ జిల్లా :
ప్రత్యేక హోదా కోరుతూ పులివెందుల ఎమ్మార్వో కార్యాలయం ఎదుట  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. రేల్వే కోడూరులో స్థానిక గాంధీ విగ్రహాం వద్ద వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి బండారు సుభద్రమ్మ ఆధ్వర్యంలో, ప్రొద్దుటూరులో స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో, బద్వేల్ పట్టణంలో వైఎస్ఆర్సీపీ నేత  గోవిందరెడ్డి ఆధ్వర్యంలో , జమ్మలమడుగులో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. 

అనంతపురం జిల్లా:
మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రాయదుర్గంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. తాడిపత్రిలో స్థానిక వైఎస్ఆర్సీపీ  నేతలు చేపట్టిన రిలే దీక్షలకు  సీపీఐ నేతలు మద్దతు తెలిపారు. కల్యాణదుర్గంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.

కర్నూలు జిల్లా :
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జి.జయరామ్ ఆధ్వర్యంలో కర్నూలులో రిలే దీక్షలు జరుగుతున్నాయి. బనగానపల్లెలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇంచార్జ్ కాటసాని రాంరెడ్డి ఆధ్వర్యంలో, నంద్యాల పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు రిలేదీక్షల్లో పాల్గొన్నారు. 

చిత్తూరు జిల్లా :
తిరుపతి స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట జరుగుతున్న రిలే దీక్షల్లో  స్థానిక ఎంపీ వర ప్రసాద్, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, మమత పాల్గొన్నారు. 
జీడీ నెల్లూరులో  ఎమ్మెల్యే నారాయణ స్వామి ఆధ్వర్యంలో , పీలేరులో  స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో , పలమనేరులో ఎమ్మెల్యే అమర్నాధ్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి .

గుంటూరు జిల్లా :
వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణ ఆధర్వంలో రేపల్లెలో కౌన్సిలర్లు, కార్యకర్తలు రిలేదీక్షలో పాల్గొన్నారు. అమరావతిలో స్థానిక పార్టీ సమన్వయకర్త పాణెం అనిమిరెడ్డి ఆధ్వర్యంలో , చిలకలూరిపేటలో గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నగరంలోని కొత్త బస్టాండ్ ఎదుట వైఎస్ఆర్సీపీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో , వినుకొండలో స్థానిక పార్టీ ఇంచార్జీ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో, మాచర్లలో స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా :
జగ్గంపేటలో స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, నవీన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రిలేదీక్షల్లో పాల్గొన్నారు. 
కడియపులంక స్థానిక జాతీయ రహదారిపై దివంగత మహానేత వైఎస్ర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ నేత ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ముమ్మడివరంలో స్థానిక నాయకుడు గుత్తుల సాయి ఆధ్వర్యంలో , రాజమండ్రిలో స్థానిక కోటగుమ్మం సెంటర్ లో వైఎస్ఆర్ సీపీ నేత,  ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వరంలో,, రంపచోడవరంలో  వైఎస్ఆర్సీపీ నేత, పార్టీ ఎమ్మెల్యే రాజేశ్వరి ఆధ్వర్యంలో , మండపేటలో స్థానిక నాయకుడు పట్టాభిరామయ్య ఆధ్వర్యంలో ,రామచంద్రాపురంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పి. గన్నవరంలో పార్టీ నేత కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో ,రాజోలులో బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో, పిఠాపురంలో పార్టీ సమన్వయ కర్త పెండెం దొరబాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు రిలేదీక్షల్లో పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా :
కొయ్యలగూడెంలో వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో , నరసాపురంలో వైఎస్ఆర్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.

నెల్లూరు జిల్లా :
ఇందుకూరుపేటలో వైఎస్ఆర్ సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.

ప్రకాశం జిల్లా :
పరుచూరు నియోజకవర్గం ఇంఛార్జ్ గొట్టిపాటి భరత్ కుమార్ ఆధ్వర్యంలో, గిద్దలూరులో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎం. అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు.

కృష్ణాజిల్లా :
పెడన బస్టాండ్ సెంటర్ లో వైఎస్ఆర్సీపీ నేత రాంప్రసాద్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కార్యకర్తలు రిలేదీక్షల్లో పాల్గొన్నారు. మైలవరం నియోజకవర్గం ఇంఛార్జ్ జోగి రమేష్ ఆధ్వర్యంలో, పామర్రులో ఎమ్మెల్యే ఉప్పునీటి కల్పన ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.