ఊసరవెల్లి చంద్రబాబు ఇంకెన్ని రంగులు మారుస్తాడో..
11 Mar, 2018 15:03 IST
ప్రకాశం: ప్రత్యేక హోదా కోసం అనేక నిరసనలు, ధర్నాలు చేసి ఉద్యమాన్ని బతికించిన వ్యక్తి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అని పార్టీ అధికార ప్రతినిధి పద్మజ అన్నారు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మజ మీడియాతో మాట్లాడుతూ.. కేసుల నుంచి తప్పించుకునేందుకు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ఎన్డీయేతో చేతులు కలిసి రాష్ట్ర ప్రయోజనాలను నాలుగేళ్లుగా తాకట్టుపెట్టాడని మండిపడ్డారు. ప్రత్యేక హోదా అంశంపై ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేక కొత్త కలర్ ఇవ్వడానికి రాజీనామాలు అనే డ్రామాలు ఆడాడన్నారు. కేంద్రంపై వైయస్‌ఆర్ సీపీ పెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వమని టీడీపీ చెప్పడంతో చంద్రబాబు రంగు బయటపడిందన్నారు. ఊసరవెల్లి చంద్రబాబు ఇంకా ఎన్ని రంగులు మారుస్తాడో ప్రజలకు తెలియాలన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.