చంద్రబాబుది దీక్షా 420

18 Apr, 2018 18:58 IST

విజయవాడ: చంద్రబాబు ఈ నెల 20న తలపెట్టి నిరాహార దీక్ష 420 దీక్ష అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు కొంగ జపం చేస్తున్నారన్నారు. హోదా కోసం తానే పోరాటం చేస్తున్నట్లు చంద్రబాబు కలరింగ్‌ ఇస్తున్నారని, ఆయనను నమ్మితే మరోసారి ఉద్యమాన్ని అమ్మేస్తారని అనుమానం వ్యక్తం చేశారు.