వైయస్సార్‌సీపీ ప్లీనరీని జయప్రదం చేయండి

26 May, 2017 18:55 IST

తిరుపతి సిటీ: తిరుపతిలో ఈనెల 30వ తేదీన జరగబోయే వైయస్సార్‌సీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీకి పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కట్టా గోపియాదవ్‌ పిలుపునిచ్చారు. ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎయిర్‌ బైపాస్‌రోడ్డులోని పీఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌హాల్‌లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో ప్లీనరీ జరుగుతుందన్నారు. ముఖ్య అతిథులుగా పార్టీ ముఖ్యనేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవీంద్రనాథడ్డి, ఇతర నాయకులు పాల్గొని భవిష్యత్‌ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే టీడీపీ ప్రభుత్వ మూడేళ్లకాలంలో చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న విషయాలను చర్చించనున్నట్లు చెప్పారు. సమావేశంలో పుష్పలత యాదవ్, పెరుగు బాబుయాదవ్, మోహన్‌యాదవ్, వేణుగోపాల్, జయరామ్‌యాదవ్, శరత్‌యాదవ్‌పాల్గొన్నారు.