24న ఆత్మకూరులో ప్లీనరీ
16 Jun, 2017 11:28 IST
నెల్లూరుః రాష్ట్రంలో ప్రతిపక్ష వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక తిరుగులేని శక్తిగా అవతరిస్తోందని వైయస్ఆర్ సీపీ ఆత్మకూర్ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ప్లీనరీ సమావేశం ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆత్మకూరులోని రవీంద్రభారతి స్కూల్ ఆవరణలో ఉదయం 9 గంటలకు ప్లీనరీ సమావేశం ఉంటుందని, ఈ సమావేశానికి నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.