లోక్‌సభలో ప్రత్యేక హోదాపై చర్చకు నోటీసులు

5 Feb, 2018 11:15 IST
ఢిల్లీ: ప్రత్యేక హోదాపై లోక్‌సభలో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు సోమవారం నోటీసులు ఇచ్చారు. నాటి ప్రధాని హామీని నిలబెట్టుకోవాలని రూల్‌ 184 కింద చర్చకు నోటీసులో కోరారు. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు, రాయలసీమ, ఉత్తరాంధ్రకు స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ప్యాకేజీ, పోలవరం, రామాయపట్నం ఓడరేవు పూర్తి చేయాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నోటీసులో కోరారు.