ప‌ట్టువీడ‌ని విక్ర‌మార్కులు వైయ‌స్ఆర్ సీపీ ఎంపీలు

3 Aug, 2016 12:06 IST

న్యూఢిల్లీ) వైయ‌స్ఆర్ సీపీ ఎంపీలు అసెంబ్లీలో త‌మ గ‌ళం వినిపిస్తూనే ఉన్నారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ఇచ్చేంత‌వ‌ర‌కు త‌మ వైఖరిలో మార్పు ఉండ‌ద‌ని వారు ప్ర‌క‌టించారు. వైయ‌స్ జ‌గ‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గ‌ట్టిగా ఉద్య‌మాలు చేస్తుంటే... వైయ‌స్ఆర్ సీసీ ఎంపీలు పెద్ద‌ల స‌భ‌లో ఉద్య‌మం చేస్తున్నారు . రెండురోజులుగా గ‌ట్టిగా త‌మ గ‌ళం వినిపిస్తున్నారు. ఈ రోజు కూడా త‌మ నినాదం గ‌ట్టిగా వినిపించ‌డానికి సిద్ధ‌మయ్యారు. పార్లమెంటులో ప్ల‌కార్డులు ప‌ట్టుకొని స్పీక‌ర్ ముందు నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఖ‌రిలో మార్పు వ‌చ్చేంత‌వ‌రకు పోరాటాన్ని ఉధ్రతం చేస్తామని, పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ స్ఫూర్తితో పోరాడతామని పేర్కొన్నారు.