వైయస్సార్సీపీ ఎంపీల ఆందోళన

8 Aug, 2016 11:30 IST
న్యూఢిల్లీః ప్రత్యేకహోదా సాధనే ధ్యేయంగా వైయస్సార్సీపీ అలుపెరగకుండా పోరాటం కొనసాగిస్తోంది. ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ లో వైయస్సార్సీపీ ఎంపీలు మొక్కవోని దీక్షతో ఉద్యమిస్తున్నారు. ప్రత్యేకహోదా ఏపీ ప్రజల హక్కు నినాదంతో వారం రోజులుగా పట్టువదలని విక్రమార్కుల్లా లోక్ సభలో పోరాటం కొనసాగిస్తున్న ఎంపీలు...నేడు మరోసారి నిరసన చేపట్టారు. తక్షణమే ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటన చేయాలంటూ ఎంపీలు స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లి సభను స్తంభింపజేస్తున్నారు.

అంతకుముందు పార్లమెంట్  ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైయస్సార్సీపీ ఎంపీలు హోదా కోసం ఆందోళనకు దిగారు. ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ వ నినదించారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, వరప్రసాద్, బుట్టా రేణుక నిరసనలో పాల్గొన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని విస్మరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంపీలు మండిపడ్డారు.